భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై ఇటీవలె జరిగిన దాడిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గంగుల శ్రీనివాస్ అనే కార్యకర్త చికిత్స పొందుతూ ఈరోజు మరణించాడు. అతని మృతి పట్ల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సంతాపం తెలిపారు.
భాజపా నేతలపై దాడులకు నిరసనగా హుజూరాబాద్‌లో ధర్నా - కరీంనగర్ జిల్లాలో భాజపా నేతల ధర్నా
భాజపా నాయకులు, కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ ఆపార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ప్రజాసామ్య పద్దతిలో భాజపాను ఎదుర్కోలేక రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. భాజపాకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఈదాడులు ఒడిగట్టారన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే తమ పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై చీనానాయక్ ఘటనాస్థలానికి చేరుకుని ధర్నాను విరమింపచేశారు. ఈకార్యక్రమంలో భాజపా నాయకులు పోరెడ్డి కిషన్‌రెడ్డి, నందగిరి మహేందర్‌రెడ్డి, పెళ్ల వెంకట్‌రెడ్డి, మాసాడి ముత్యంరావు, బింగి కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గంగుల శ్రీనివాస్ మరణం ఎంతగానో బాధిస్తోంది: బండి సంజయ్