ఇల్లంతకుంటలో ఏబీవీపీ నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏబీవీపీ నాయకులపై దాడికి పాల్పడిన తెరాస నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇల్లంతకుంట దాడిని నిరసిస్తూ హుజూరాబాద్‌లో భాజపా ధర్నా - Karimnagar District News
ఇల్లంతకుంటలో ఏబీవీపీ నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ హుజూరాబాద్‌లో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. తెరాస నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హుజూరాబాద్‌లో భాజపా ధర్నా
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భాజపా నాయకులకు నచ్చజెప్పి... ధర్నాను విరమింపజేశారు.
ఇదీ చదవండి:ఇలా స్నానం చేస్తే తాజాదనం సొంతం!