కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ శివ నరేష్ ఫంక్షన్హాల్లో భాజపా నాయకులు వలస కార్మికుల కోసం నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలో ఉండే.. వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో తిండికి ఇబ్బంది పడకుండా ప్రతిరోజు 200 మందికి భోజనం అందించే నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు.
కరీంనగర్లో వలస కార్మికులకు నిత్యాన్నదానం - కరీంనగర్లో వలస కార్మికులకు అన్నదానం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు
లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ ఇరుక్కుపోయిన వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలకు నిత్యం భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్లో భాజపా నాయకులు ప్రతిరోజూ 200 మందికి భోజనం పెడుతున్నారు.
కరీంనగర్లో వలస కార్మికులకు నిత్యాన్నదానం
భాజపా నేత లడ్డు సురేష్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కేంద్రం నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని 58 డివిజన్ కార్పొరేటర్ రాపర్తి విజయ తనయుడు రాపర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు 200 మందికి భోజనం అందించారు.
ఇవీ చూడండి:'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'