బీసీలపై తెరాస ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ ఆరోపించారు. వారిపట్ల చిత్తశుద్ధి లేదని.. అణగారిన వర్గాల కోసం ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు.
గొల్ల కురుమలకు సబ్సిడీ గొర్రెలు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అటెండర్ నుంచి గెజిటెడ్ అధికారి పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చదివించేలా దేశ వ్యాప్తంగా చట్టాలు సరళతరం చేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది అప్పుడే అందరికీ అందుతుందన్నారు.