ఈటల రాజేందర్(Eatala Rajender) భాజపాలోకి రావడంపై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అంసతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల రాకపై నాతో మాట మాత్రం చెప్పరా? అంటూ పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. భాజపా(BJP)లో ఒక్క వర్గం మాత్రమే ఈటలకు మద్దతుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈటలతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం శోచనీయమని పెద్దిరెడ్డి అసహనం వెలుబుచ్చారు. ఈటలకు తనకు ఎలాంటి విభేదాలు లేవన్న పెద్దిరెడ్డి 2023లో హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని భావించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని చెప్పారు.
BJP: ఆయనొస్తానంటే ఈయనకు కోపమొచ్చింది..! - పెద్దిరెడ్డి వార్తలు
మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajender) ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఆయన భాజపాలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు భాజపా(BJP) అధిష్ఠానం కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈటల రాకపై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈటల రాజేందర్, పెద్దిరెడ్డి