హుజూరాబాద్‌లో అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్‌కు బానిసే అని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార తెరాస రూ.కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడే వ్యక్తి కావాలా? అనేది హుజూరాబాద్ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. హుజూరాబాద్ ఎన్నిక ఉపఎన్నిక మాత్రమే కాదని.. ఈ ఎన్నికతో ఇంకెంతమంది రాజేందర్‌లు ప్రశ్నిస్తారోనని సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలందరి మీద కేసీఆర్ నిఘా ఉందన్నారు. 2014కు ముందు వరకు సీఎం కేసీఆర్, హరీశ్‌రావు ఆస్తులెంతో ప్రజలందరికీ తెలుసునని ఈటల వెల్లడించారు.
హుజూరాబాద్‌లో ఇప్పటివరకు కేసీఆర్ రూ.192 కోట్లు ఖర్చు పెట్టారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి దసరా పండుగ నడుస్తోందని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో భాజపా నాయకుల పైనే కాకుండా తెరాస ఇంఛార్జిలపై కూడా నిఘా పెట్టించారని ఆరోపించారు.
హుజూరాబాద్‌లో కూడా ఆగవు