20ఏళ్ల ఉద్యమ చరిత్రలో ప్రజాదరణ పొందిన తనను ఓడించే శక్తి తెరాసకు లేదని భాజపా నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లిలో వివిధ కులసంఘాల ప్రతినిధులతో ఈటల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు భాజపాలో చేరారు. వారందరికీ ఈటల.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెరాస పార్టీలో తిరగకపోతే పింఛను, రేషన్ కార్డు ఉండదని బెదిరిస్తున్నారు. వారి బెదిరింపులకు సామాన్య ప్రజలు ఎవరూ బెదిరే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలే తప్ప చుట్టంగా కాదు. ఇరవై ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో పనిచేశా. ప్రజాదరణ పొందాను. నన్ను ఓడించే శక్తి తెరాసకు లేదు. -ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత