లాక్డౌన్తో కరీంనగర్ జిల్లా కేంద్రం జ్యోతి నగర్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, కూలీలను భాజపా కార్యకర్తలు ఆదుకుంటున్నారు. స్థానిక భాజపా నాయకురాలు చైతన్య రమేశ్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
వలస కూలీలకు చైతన్య రమేశ్ ఆసరా - జ్యోతి నగర్లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
లాక్డౌన్ కారణంగా కరీంనగర్ పట్టణం జ్యోతి నగర్లో తిండి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు స్థానిక భాజపా నాయకురాలు చైతన్య రమేష్ నిత్యావసరాలు పంపిణీ చేసి వారి ఆకలి తీరుస్తున్నారు.
![వలస కూలీలకు చైతన్య రమేశ్ ఆసరా bjp leader Chaitanya ramesh distributed food items to poor people at karimnagr district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6746947-thumbnail-3x2-bjp.jpg)
వలస కూలీలకు నిత్యావసరాలు అందజేసిన చైతన్య రమేశ్
కరోనా వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వాలు సూచించిన నియమాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు.
ఇదీ చూడండి:లాక్డౌన్ ఎఫెక్ట్.. చిరంజీవి రక్త నిధి కేంద్రంలో అడుగంటిన నిల్వలు