సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరని ఆయన మాటలు నమ్మవద్దని భాజపా నేత బాబు మోహన్ విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చాయో గుండెల మీద చేయి వేసుకోని చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి మంచి నాయకున్ని ఎన్నుకోవాలంటే భాజపాను ఎక్కువ స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ను గెలిపించాలని బాబు మోహన్ విజ్ఞప్తి చేశారు.
కేసీఆరే పచ్చి అబద్ధాల కోరు: బాబు మోహన్ - కరీంనగర్
నిర్మల్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా నేత బాబు మోహన్ స్పందించారు. ప్రధాని మోదీని అబద్ధాలకోరు అనటం సరికాదన్నారు. త్వరలో ముఖ్యమంత్రి అసత్యాలపై కరపత్రం విడుదల చేస్తామన్నారు.
కరీంనగర్లో మీడియా మాట్లాడుతున్న బాబు మోహన్