దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రజలు భాజపాకే పట్టం కడతారని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో భాజపా శ్రేణులు నిర్వహించిన సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. తెరాస పతనం మొదలైందని... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే తరహాలో పనిచేస్తామని తెలిపారు.
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ భాజపాదే గెలుపు' - కరీంనగర్ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
దుబ్బాకలో భాజపా గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. తెరాస పతనం ప్రారంభమైందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ భాజపాదే గెలుపు అని మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో నిర్వహించిన సంబురాల్లో ఆమె పాల్గొన్నారు.
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ భాజపాదే గెలుపు'
దుబ్బాకలో భాజపాను గెలిపించినందుకు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. డప్పు చప్పుళ్లతో పార్టీ శ్రేణులు నృత్యాలు చేస్తూ... టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు.
ఇదీ చదవండి:దుబ్బాక విజయంతో కమలం నేతల్లో కొత్తజోష్