దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి విజయం సాధించడంతో కరీంనగర్లో సంబురాలు మిన్నంటాయి. స్థానిక పార్లమెంట్ కార్యాలయం ముందు పెద్దసంఖ్యలో భాజపా శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.
కరీంనగర్లో అంబరాన్నంటిన భాజపా సంబురాలు - కరీంనగర్ జిల్లా తాజా సమాచారం
అత్యంత ప్రతిష్టాత్మక దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించడంతో భాజపా శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయోత్సవాలు జరుపుకున్నారు.

కరీంనగర్లో అంబరాన్నంటిన భాజపా సంబురాలు
త్వరలో రాష్ట్రంలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ఒరవడి కొనసాగుతుందని భాజపా కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆధ్వర్యంలో దుబ్బాకలో విజయం సాధించడం అభినందనీయమన్నారు.