నగర పాలక సంస్థలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... కరీంనగర్ భాజపా నాయకులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. భాజపా నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలో రహదారులు అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు మురుగు కాలువల సమస్య మరోవైపు త్రాగునీటి సమస్యతో నగర ప్రజలు సతమతమవుతున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నగరపాలక సంస్థలోని సమస్యలు పరిష్కరించాలని కోరారు.
కరీంనగర్ భాజపా నాయకుల అరెస్ట్ - కరీంనగర్ భాజపా నాయకుల అరెస్ట్
రోడ్లు పాడయ్యాయి... ఓ వైపు మురుగు కాలువలు.... మరో వైపు త్రాగునీటి సమస్య... వీటన్నింటిని తీర్చాలంటూ భాజపా నాయకుల ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కరీంనగర్ భాజపా నాయకుల అరెస్ట్