తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ది విభజించి పాలించు ధోరణి'

ముఖ్యమంత్రి కేసీఆర్ విభజించి పాలించు అనే ధోరణిలో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు బండి సంజయ్. ఎమ్మెల్యేగా స్వల్ప ఓట్లతో ఓడిపోయిన తనని మరోసారి అవకాశం ఇచ్చి పార్లమెంట్​కు పంపించాలని ఓటర్లను కోరారు.

బండి సంజయ్ ప్రచారం

By

Published : Apr 3, 2019, 10:34 AM IST

బండి సంజయ్ ప్రచారం
హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తూ కేసీఆర్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్​. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో ప్రచారం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో భారత్​ను​ శక్తివంతంగా మార్చాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాలని తెలిపారు. అహంకార ధోరణితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేసీఆర్​కు ప్రజలు బుద్ది చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. కరీంనగర్​లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details