తెలంగాణ

telangana

ETV Bharat / state

etela rajender: 'దేశ చరిత్రలో హుజూరాబాద్​ ఉప ఎన్నిక ఒక చీకటి అధ్యాయం' - హుజూరాబాద్​లో కిషన్​ రెడ్డి

దేశ చరిత్రలో హుజూరాబాద్​ ఉప ఎన్నిక ఒక చీకటి అధ్యాయం, ప్రజాస్వామ్యానికి ఒక గొట్టలి పెట్టు అని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​ అన్నారు. దీనికి కారకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మఖ్యమంత్రి అని ఆరోపించారు. హుజూరాబాద్​లో ఎలాగైన గెలిచేందుకు అధికార దుర్వినియోగంతో, బాధ్యతను విస్మరించి గత 5 నెలల 8రోజులగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. భాజపా అభ్యర్థిగా నామినేషన్​ వేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

etela
etela

By

Published : Oct 8, 2021, 5:27 PM IST

Updated : Oct 8, 2021, 10:53 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కిషన్​ రెడ్డి, ఈటల తదితరులు పాల్గొన్నారు.

ఈటల రాజేందర్​, భాజపా అభ్యర్థి

దేశ చరిత్రలో హుజూరాబాద్​ ఉప ఎన్నిక ఒక చీకటి అధ్యాయం, ప్రజాస్వామ్యానికి ఒక గొట్టలి పెట్టు. దీనికి కారకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మఖ్యమంత్రి. అధికార దుర్వినియోగంతో, బాధ్యతను విస్మరించి గత 5 నెలల 8రోజులగా హుజూరాబాద్​లో ఎలాగైన గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో అరడజనుగు పైగా మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వందల సంఖ్యలో నాయకులు, వేల సంఖ్యలో కార్యకర్తలు నిత్యం ఇక్కడ ఉంటూ... ప్రజలను ప్రలోభపెట్టడం, భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. -ఈటల రాజేందర్​, భాజపా అభ్యర్థి.

ఉప ఎన్నిక ఫలితాలు ప్రజలే చెబుతున్నారు

ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఊహించడం కష్టమని.. అలాంటిది ఉప ఎన్నిక సమయంలో మరింత నిగూఢంగా ఉంటుందని ఈటల అన్నారు. కానీ హుజూరాబాద్​లో 96 నుంచి 97 శాతం మంది భాజపాకే ఓటు వేస్తున్నారని బహిరంగంగానే చెబుతున్నారని ఈటల పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అనేక సర్వే సంస్థలు చెబుతున్నాయని ఆయన వెల్లడించారు.

దళితబంధుకు... హుజూరాబాద్​ ఈటల రాజేందర్​ దళితబంధు అని పేరు పెట్టాలి

హుజూరాబాద్​ ఉప ఎన్నిక.. నియోజకవర్గ ఎన్నికలు అయినప్పటికీ ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్నవిగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ఇంత భయంకరమైన అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.

కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి.

రాష్ట్రంలో నేనే ఉండాలి, నా కుటుంబం మాత్రమే ఉండాలి, ప్రశ్నించే వాళ్లు ఉండకూడదనే ఆలోచన దుర్మార్గమైనది. హుజూరాబాద్​ ప్రజలు వేసే ఓటు... అంబేడ్కర్​ రాజ్యాంగానికి ప్రతిష్ఠ తెచ్చేదిగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గత 5 నెలలుగా పూర్తిగా బరితెగించి... ఎన్నికల్లో ఎలాగైనా గెలివాలని దుర్మార్గపు ఆలోచనలతో అన్ని అడ్డదారులు తొక్కుతోంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దళితబంధు తెచ్చింది. రాష్ట్రంలో దళితబంధు తెచ్చిన ఘనత హుజూరాబాద్​ ప్రజలకు, ఈటలకు, భాజపాకు చెందుతుంది. "దళితబంధు పథకానికి హుజూరాబాద్​ ఈటలరాజేందర్​ దళితబంధు" అని పేరు పెట్టాలని కోరుతున్నాను. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దళితులందరికీ వెంటనే నిధులు అందించాలని కోరుతున్నాము.

ఈటల ఎవరికీ అన్యాయం చేసే వ్యక్తి కాదు. మాట కోసం పద్ధతి కోసం పరితపించే వ్యక్తి ఈటల. కుటుంబ పెత్తనాన్ని నిలదీసిన వ్యక్తి. ఈ ఎన్నిక సందర్భంగా కేసీఆర్​ కుటుంబ పీఠాలు కదులుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడడానికి హుజూరాబాద్​ ప్రజలు... తెలంగాణకు మార్గం చూపుతారు. హైదరాబాద్ నగరం​, దుబ్బాకలో ప్రజలు ఏవిధంగా తెరాసకు బుద్ధి చెప్పారో అందరూ చూశారు. ప్రజల తీర్పు ముందు ఎవరూ నిలబడలేరు. అధికారం ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి శాశ్వతం కాదు. తెలంగాణను కేసీఆర్​ కుటుంబానికి ఎవ్వరూ రాసివ్వలేదు. -కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి.

హుజూరాబాద్​లో ప్రజస్వామ్యం గెలవకూడదని ప్రగతిభవన్​ వేదికగా అనేక రకాలుగా పాలక పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కిషన్​రెడ్డి ఆరోపించారు. మాట తప్పడం, మడమ తిప్పడం తెరాసకు చెల్లుతుందని.... తెరాస మాట మీద నిలబడే పార్టీ కాదని విమర్శించారు. గత పార్లమెంటు ఎన్నికల నుంచి రాష్ట్ర ప్రజలు మార్పు వైపు అడుగు వేస్తున్నారని... వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపా అధికారం రావడం ఖాయమని కిషన్​ రెడ్డి అన్నారు. వచ్చే 20 రోజులు చాలా కీలకమని.... కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి:హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్

Last Updated : Oct 8, 2021, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details