నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడికి నిరసనగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎంపీ అర్వింద్‌పై దాడికి నిరసనగా భాజపా ఆందోళన - BJP Leaders Strike latest news
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై వరంగల్‌లో జరిగిన దాడికి నిరసనగా హుజూరాబాద్‌లో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంపీ అర్వింద్‌పై దాడికి నిరసనగా భాజపా నిరసన
దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో అక్కడకు చేరుకొన్నారు. భాజపా నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.