తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ చిత్రంలేదని భాజపా ఆందోళన - protest at karimnagar hospital

కరోనా టీకా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ చిత్రం లేదంటూ.. భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

BJP activists have raised concerns in Karimnagar district that there is no picture of the Prime Minister in the Kovid vaccine flexi.
ప్రోటోకాల్ పాటించాలని.. భాజపా కార్యకర్తల ఆందోళన

By

Published : Jan 16, 2021, 5:10 PM IST

కొవిడ్ టీకా ఫ్లెక్సీలో ప్రధాని చిత్రం లేదంటూ.. భాజపా కార్యకర్తలు కరీంనగర్‌ జిల్లాలో ఆందోళన చేపట్టారు. జిల్లా ఆస్పత్రి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రోటోకాల్ పాటించకపోగా.. దానికి అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఫ్లెక్సీ తొలగించి..

సీఎం ఫ్లెక్సీ తొలగించి ప్రధాని చిత్రపటాన్ని ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని ‌హెచ్చరించారు.

ఇదీ చదవండి:ఆ కోడి మాంసానికి ధర ఎక్కువ.. ఎందుకో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details