తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్​స్టేషన్​లో 'పుట్టినరోజు'పై విచారణ - MANAKONDUR PS

మానకొండూరు పోలీస్ స్టేషన్​లో కాంట్రాక్టర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఘటనపై కరీంనగర్ సీపీ విచారణకు ఆదేశించారు.

'ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పీఎస్​లో బర్త్ డే చేసుకోవడమా'

By

Published : May 6, 2019, 1:33 PM IST

Updated : May 6, 2019, 5:42 PM IST

మానకొండూరు పోలీస్ స్టేషన్​లో జరిగిన పుట్టిన రోజు వేడుకల సంఘటనపై కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనపై ఏసీపీ, ఆ పై స్థాయి అధికారులతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందన్నారు. బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఏం చేసినా సహించబోమన్నారు. పోలీస్ స్టేషన్​లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని తప్పు పడుతున్నట్లు సీపీ వెల్లడించారు.

అసలేం జరిగింది?

కరీంనగర్ జిల్లా మానకొండూరులో గుత్తేదారు పుట్టిన రోజు వేడుకలు పోలీస్ స్టేషన్​లో జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డిని స్వయంగా సీఐ ఇంద్రసేనా రెడ్డి... పీఎస్​కి పిలిపించుకొని కేక్ కట్ చేయించడం, శాలువా కప్పడం, పూలమాలలు వేయడం చర్చనీయాంశంగా మారాయి. కేక్ కట్ చేయిస్తూ చేసిన ఈ వేడుక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గుత్తేదారు పుట్టినరోజు వేడుకలు స్టేషన్​లో జరపడమేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. స్పందించిన సీఐ ఇంద్రసేనా రెడ్డి... రవీందర్ రెడ్డి తనకు దగ్గరి బంధువు కావడం వల్లే వేడుక నిర్వహించినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: పోలింగ్ ఆపేసి సిబ్బంది అల్పాహారం.. ఓటర్ల ఆగ్రహం..

Last Updated : May 6, 2019, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details