ద్విచక్రవాహనాలు దొంగలిస్తూ... తక్కువ ధరకు అమ్మేస్తున్న అంతర్జిల్లా దొంగను కరీంగనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మధుకర్‌రెడ్డి... సైదాపూర్ మండలానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నిందితుని నుంచి ఐదు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మానకొండూరు పోలీసులు తనిఖీలు చేపట్టగా... భయపడి ద్విచక్రవాహనం విడిచిపెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారించగా... దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు వివరించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డట్లు, నిందితుని మీద కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ద్విచక్ర వాహనాల దొంగ దొరికాడు... - BIKE THIEF ARRESTED IN KARIMNAGAR
కరీంనగర్, వరంగల్ జిల్లాలో ద్విచక్రవాహనాలు దొంగతనం చేస్తున్న దుండగున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నారు.
![ద్విచక్ర వాహనాల దొంగ దొరికాడు... BIKE THIEF ARRESTED IN KARIMNAGAR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5418971-thumbnail-3x2-ppp.jpg)
BIKE THIEF ARRESTED IN KARIMNAGAR