తెలంగాణ

telangana

ETV Bharat / state

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. మరో వ్యక్తి అరెస్టు - Bhairi Agnitej posts on Ayyappa Swamy

సామాజిక మాధ్యమాల్లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు, పోస్ట్‌లు పెట్టిన కరీంనగర్‌ జిల్లా వాసి బైరి అగ్నితేజ్‌ను కమలాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

Bhairi Agnitej was arrested
Bhairi Agnitej was arrested

By

Published : Jan 1, 2023, 4:46 PM IST

గత నెల 30న ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి అగ్నితేజ్‌ అనే వ్యక్తిని కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కమలాపూర్‌ మండలం రాములపల్లికి చెందిన బైరి అగ్నితేజ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. కమలాపూర్‌ శివారులో అగ్నితేజ్‌ను గతరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ రోజు న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పోలీసులు వెల్లడించారు.

" గత నెల 30న ఫేస్‌బుక్‌లో బైరి అగ్నితేజ్‌ అనే యువకుడు అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అందుకే ఆయన్ను నిన్న అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాం. సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు."-సంజీవ్‌, కమలాపూర్‌ ఇన్స్‌స్పెక్టర్‌

సోషల్‌ మీడియాలో అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. మరో వ్యక్తి అరెస్టు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details