కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి ముందు ఓ యాచకుడు సోమవారం ఉదయం మృతి చెందాడు. కరోనా భయంతో అతని మృతదేహాన్ని సాయంత్రం వరకూ ఎవరూ పట్టించుకోలేదు. 24 గంటల పాటు ఆ రహదారిలో వాహనాల అలికిడి ఉన్నప్పటికీ శవాన్ని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేయలేదు.
కరోనా భయం.. మృతదేహాన్ని పట్టించుకోని వైనం - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
కరోనా సమయంలో మానవతా విలువలు మంటగలుస్తున్నాయి. మరణించిన వారిని కనీసం పట్టించుకునే ప్రయత్నం చేసేందుకే ప్రజలు వణికిపోతున్నారు. అయిన వారు మృతిచెందినా అలాగే వదిలేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఓ యాచకుడు మృతి చెందగా... సాయంత్రం వరకు అతన్ని మృతదేహాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో యాచకుడు మృతి
ఆయన చాలా కాలంగా అక్కడే ఉంటున్నారని స్థానిక దుకాణాదారులు తెలిపారు. యాచకుడు మృతిచెందిన విషయాన్ని పక్కనే ఉన్న నగరపాలక సిబ్బందికి, ఒకటో పట్టణ పోలీసులకు తెలిపినప్పటికీ... వారు పట్టనట్లుగా వ్యవహరించారని అన్నారు. సాయంత్రం వరకూ మృతదేహం అక్కడే ఉండడంతో చివరికి నగరపాలక సిబ్బంది మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.