తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊళ్లో ఎలుగుబంటి హల్​చల్​.. బంధించిన అటవీ అధికారులు - భల్లూకం

కరీంనగర్ జిల్లా మొలంగూర్‌లో చెట్టెక్కిన ఎలుగుబంటిని సహాయక బృందాలు పట్టుకొని బంధించారు. గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ఊళ్లో ఎలుగుబంటి హల్​చల్​.. బంధించిన అటవీ అధికారులు

By

Published : Sep 24, 2019, 4:02 PM IST

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌లో చెట్టెక్కిన ఎలుగుబంటిని దించేందుకు సహాయక బృందాలు చేపట్టిన చర్యలు ఫలించాయి. ముందుగా గన్‌ ద్వారా ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చారు. కాసేపటికే కిందపడిపోయిన భల్లూకాన్ని వలలో పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడే మత్తులోంచి బయటకొచ్చిన ఎలుగుబంటి అదిరిపడి పారిపోయింది. భల్లూకం వెంట గ్రామస్థులు, అటవీశాఖ అధికారులు పరుగులు తీశారు. అనంతరం గుట్టల్లో సొమ్మసిల్లి పడిపోయిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. బోనులో బంధించి ములుగు జిల్లా తాడ్వాయి ప్రాంతానికి తరలించారు.

ఊళ్లో ఎలుగుబంటి హల్​చల్​.. బంధించిన అటవీ అధికారులు

ABOUT THE AUTHOR

...view details