తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓవైపు విధులు మరోవైపు సంప్రదాయం.. బతుకమ్మ ఆడిన ఎస్సై - చొప్పదండిలో సద్దుల బతుకమ్మ వేడుకలు

కరీంనగర్​ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు జరిగాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ వస్త్రాలంకరణతో ఆటపాటలతో సందడి చేశారు.

bathukamma festival celebrations at choppadandi in karimnagar district
విధులు.. సంప్రదాయం రెండింటి మేళవింపుగా బతుకమ్మ ఆడిన ఎస్సై

By

Published : Oct 24, 2020, 8:44 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గునుగుపూలు సేకరించి గౌరమ్మలను అందంగా పేర్చారు. వాడవాడలా వేదికలు ఏర్పాటు చేసి బతుకమ్మ ఆడారు. సాంప్రదాయ పాటలతో గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.

చొప్పదండి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల మండలాల్లో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. రామడుగు మండలం గోపాల్ రావుపేటలో ఎస్సై గొల్లపల్లి అనూష విధినిర్వహణలోనూ బతుకమ్మ ఆడారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABOUT THE AUTHOR

...view details