ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కరీంనగర్‌లోని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతూ కరీంనగర్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బ్యాంకులన్నింటినీ మూసేసి యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా చేపట్టారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: బ్యాంక్ ఉద్యోగులు - తెలంగాణ వార్తలు
బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్రం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: బ్యాంక్ ఉద్యోగులు
కేంద్రప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుతో నిరసన చేపట్టారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని... లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:మజ్లిస్ కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ నడుస్తోంది: బండి సంజయ్