తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడ రాజన్నను మోసం చేసిన కేసీఆర్​: బండి సంజయ్​ - మహాశివరాత్రి 2023

Bandi Sanjay Fire On Kcr: మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న స్వామిని బండి సంజయ్​ దర్శించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్​, ఎమ్మెల్సీ కవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రతి సంవత్సరం రూ.100 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి.. ఇప్పటివరకు ఆ మాట నెరవేరలేదని విమర్శించారు.

bjp chief bandi
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​

By

Published : Feb 18, 2023, 7:23 PM IST

Bandi Sanjay Visited Vemulawada Rajanna Temple: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్​ మాటతప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపణలు చేశారు. వేములవాడ మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజరాజేశ్వర స్వామి వారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బండి సంజయ్ సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

దేశం సుభీక్షంగా ఉండాలని రాజన్నను కోరుకున్నట్లు బండి సంజయ్​ తెలిపారు. రాజన్న సన్నిధికి దర్శించుకోవడానికి ఎక్కువగా పేద ప్రజలే వస్తున్నారని పేర్కొన్నారు. శివదీక్ష పరులు ఎక్కువగా పెరిగిపోయారని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు శివుని మర్చిపోలేరని కొనియాడారు.

అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్​ను కూడా ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేరని మండిపడ్డారు. ఎందుకంటే యాదాద్రి అభివృద్ధి చేసినట్లే.. వేములవాడను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి మర్చిపోయారని విమర్శించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యిందని ధ్వజమెత్తారు. "సాక్ష్యాత్తు ఆ పరమశివుని సన్నిధిలో అడుగుతున్నా.. నీ బిడ్డ పేరు దొంగ సారా దందాలో నాలుగుసార్లు వచ్చిందని.. మరి ఎందుకు నోరు విప్పడం లేదు" అని ప్రశ్నించారు. రాజన్న సన్నిధిలో బీజేపీ మెడికల్​ సెల్​ను ఏర్పాటు చేసిందని తెలిపారు.

"వేములవాడ అభివృద్ధికి సీఎం కేసీఆర్​ ఇప్పటి వరకు ఎంత కేటాయించారో చెప్పాలి. నీ బిడ్డ అక్రమ మద్యం కేసులో రూ.100కోట్ల తీసుకుపోయింది. ఎప్పటికైనా పోలీసులు అరెస్ట్​ చేయడం ఖాయం. అయితే వేములవాడ దేవాలయానికి సీఎం రూ.50కోట్లు అడిగితే డబ్బులు ఇవ్వడం లేదు. ఎమ్మెల్సీ కవితకు మాత్రం రూ.100కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. ఇవాళ శివరాత్రి జాతరలో పేదవాళ్లకు కనీస సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదు. ఆ ఆది దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఆ దేవుడు సీఎంను చూస్తూ ఊరుకోడని.. అలాగే ప్రధాని మోదీ కూడా సీఎం కేసీఆర్​ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు." - బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

వేములవాడ రాజన్న స్వామిని దర్శించుకున్న బండి సంజయ్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details