లోక్సత్తా ఉద్యమ నాయకుడు నారెడ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ఇటీవల నారెడ్ల శ్రీనివాస్ కరోనాతో మరణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్యాయం జరిగిందంటూ.. వచ్చిన బాధితులకు అండగా ఉన్న గొప్ప వ్యక్తి నారెడ్ల అని సంజయ్ కొనియాడారు.
లోక్సత్తా నేత కుటుంబ సభ్యులకు "బండి" పరామర్శ - bandi sanjay latest news today
లోక్సత్తా ఉద్యమ నాయకుడు నారెడ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. అతని మరణం జిల్లా ప్రజలకు తీరని లోటని ఆయన అన్నారు.
లోక్సత్తా నేత కుటుంబ సభ్యులకు "బండి" పరామర్శ
అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన శ్రీనివాస్ మరణం కలచివేసిందన్నారు. పేదలు, ఉన్నత విద్యావంతులకు అనేక సూచనలు చేస్తూ మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా బండి ప్రకటించారు.
ఇదీ చూడండి :అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ అన్నం.. గ్రామస్థుల ఆందోళన