మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా ఎంపీ బండి సంజయ్ - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్
కేంద్రం ప్రభుత్వం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల పట్టణంలో ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి భాజపా మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల కరీంనగర్లో మైనార్టీ సోదరులు సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్‌లో టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
గతంలో బండి సంజయ్ పదవిలో లేనప్పటికీ మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేశారని భాజపా మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు ముజీబ్ పేర్కొన్నారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నామని ముజీబ్ తెలిపారు.