Bandi Sanjay challenge to KTR on early elections: సీఎం కేసీఆర్ రైతు బంధు ఇచ్చి సబ్సిడీలు లేకుండా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కమిషన్ల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని.. రైతుల ఆత్మహత్యలో రాష్ట్రం నాలుగో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన బండి సంజయ్.. తెలంగాణలో రైతులను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లోని రైతులకు చెక్కులు ఇచ్చారని విమర్శించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రనికి ఎంత వాటా తెచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాకుండా ముందస్తు ఎన్నికలపై శనివారం కేటీఆర్ చేసిన సవాల్‌పై బండి సంజయ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. అయితే ముందస్తు ఎన్నికలకు సిద్ధమనే మాట కేటీఆర్ తన తండ్రి కేసీఆర్‌తో చెప్పించాలని పేర్కొన్నారు. బీజేపీలో కోవర్టులున్నట్లు ఈటల అనలేదని.. మీడియానే అలా వక్రీకరించిందని బండి పేర్కొన్నారు.
KTR challenges BJP on early elections: కేంద్రానికి దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు రావాలని.. అప్పుడు తాము కూడా ముందస్తుకు సిద్ధమని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. శనివారం నిజామాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కేటీఆర్.. కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ సమర్థతపై అక్కసుతో కక్ష కట్టిన మోదీ సర్కార్.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్‌లోనైనా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
"ముందస్తు ఎన్నికలకు మేము కూడా సిద్ధమే. ముందస్తు ఎన్నికలకు సిద్ధమనే మాట కేటీఆర్ తన తండ్రితో చెప్పించాలి. మా పార్టీలో కోవర్టులున్నట్లు ఈటల అనలేదు.. మీడియానే వక్రీకరించింది. స్పౌజ్ బదిలీలపై ఇప్పటికీ స్పష్టత లేదు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. గత కేబినెట్‌లో మహిళలు లేరు. రైతు బంధు ఇచ్చి సబ్సిడీలు లేకుండా చేశారు. పండించిన ప్రతి గింజకు కేంద్రమే డబ్బులు ఇస్తోంది".-బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
'ముందస్తు ఎన్నికలకు మేము కూడా సిద్ధమే' ఇవీ చదవండి: