Bandi Sanjay on Congress Government : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్వాగతించారు. తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay on Ration Cards in Telangana : రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని బండి సంజయ్(Bandi Sanjay on New Ration Cards in Telangana) అన్నారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. మరో లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నారని చెప్పారు. వాళ్లందరికీ న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీంతో పాటు అప్పుల రాష్ట్రంగా చూపించారని, పెట్టుబడులు ఎలా తీసుకువస్తారో తెలియజేయాలని అన్నారు.
మిడ్ మానేరు బాధితుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం : బండి సంజయ్
Bandi Sanjay Interesting Comments on Six Guarantees: రాష్ట్రంలో తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని బండి సంజయ్ కోరారు. దీంతో పాటు రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్దిదారులను గుర్తించి 6 గ్యారంటీలు(Congress Six Guarantees) అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.