తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్ని కుట్రలు చేసినా భైంసా ప్రజలను నా నుంచి వేరు చేయలేరు: సంజయ్‌ - కేసీఆర్​పై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay fires on TRS Govt: ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడుగనా అడ్డంకులు సృష్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మొదటి విడత యాత్రకు అనుమతిచ్చిన పోలీసులు.. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలతో పాదయాత్ర కొనసాగిస్తామని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా భైంసా ప్రజలను తన నుంచి వేరు చేయలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Nov 28, 2022, 4:14 PM IST

Bandi Sanjay fires on TRS Govt: ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత యాత్రకు అనుమతిచ్చిన పోలీసులు.. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కరీంనగర్‌లోని భాజపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు 4 విడతలుగా ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించామని బండి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డకునేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. అందుకే హైకోర్టును ఆశ్రయించామన్న బండి సంజయ్... ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తామని బండి సంజయ్ తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అక్కడి నుండే పాదయాత్రను ప్రారంభిస్తామని చెప్పారు.

భైంసా వెళ్లాలంటే వీసా కావాలా : భైంసాకు దూరం చేశారేమో కానీ భైంసా ప్రజల నుంచి బండి సంజయ్‌ని దూరం చేయలేరనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం, తెరాస కలిసి ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుంచి భైంసా ప్రజలను వేరు చేయలేరన్నారు. అక్కడికి ఎందుకు వెళ్లకూడదు.. భైంసా వెళ్లాలంటే వీసా కావాలా.. అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. భైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా అని నిలదీశారు. అసలు భైంసాలో అల్లర్లకు కారకులెవరో.. ఆ అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసనని విమర్శించారు.

ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు : అమాయకుల ఉసురు తీసిందెవరన్న బండి సంజయ్... పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరని ప్రశ్నించారు. తాము భైంసాలో పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే భైంసాకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. గతంలో పాతబస్తీలో పాదయాత్రను ప్రారంభించామన్న బండి.. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగాయా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు.. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజలతో మాట్లాడుతామన్నారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్న ఆయన.. వారికి భరోసా కల్పిస్తామని బండి సంజయ్‌ అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details