Bandi Sanjay Fires on CM KCR : బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో కాస్త అభివృద్ధి జరిగిందని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా చెప్పుకుంటుందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రమంత్రి అమిత్ షా సభకు విపరీతమైన జానాధరణ వచ్చిందని.. బీజేపీకి అనుకూల వాతావరణం వచ్చిందని అన్నారు. కొంత మంది నాయకులు బీజేపీకి రాష్ట్రంలో గ్రాఫ్ తగ్గిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకు మాత్రమే ఉందని అన్నారు.
Bandi Sanjay React on Paper News: రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల కబ్జాలు, వేధింపులు తట్టుకోలేక చాలా కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయని సంజయ్ ఆరోపించారు. ఇదే సమయంలో ఓ పత్రికలో తాను బీఆర్ఎస్కు ఓటు వేయమని ప్రచారం చేస్తున్నట్లు వచ్చిన వార్తపైనా బండి సంజయ్ స్పందించారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలిస్తే ఓటేయమని అన్నానని వివరణ ఇచ్చారు. నిజంగానే ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తే ఓటు వేయమన్నానని.. ఇవి ఎందుకు పత్రికలో రాయలేదని నిలదీశారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసింది.. చేసేది బీజేపీనేనని తెలిపారు.
Bandi Sanjay Comments on KCR : దమ్ముంటే.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి: బండి సంజయ్
Bandi Sanjay Latest Comments : కేంద్రం నిధులు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కాస్త అభివృద్ధి చేసిందని సంజయ్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది అన్నట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటలు నష్టపోతే పరిహారం ఎందుకు చెల్లించ లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో(Manifesto) దిమ్మ తిరుగుతుందని ఆ పార్టీ నాయకులు చెప్పడం జోక్‌గా ఉందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రకటించిన 100 మందికి బీ ఫారాలు ఇస్తారన్న గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు.