కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పెట్టెలను చొప్పదండిలో భద్రపరిచారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిశాక.. అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలకు సీలు వేశారు. అనంతరం భద్రత నడుమ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌కు పెట్టెలను తరలించారు. చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో 81 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
బ్యాలెట్ పెట్టెలు.. స్ట్రాంగ్ రూమ్‌కు తరలింపు - Telangana Muncipall Elections news Updates
కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో 81 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
బ్యాలెట్ పెట్టెలు.. స్ట్రాంగ్ రూమ్‌కు తరలింపు