కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్‌హౌస్‌లోని బాహుబలి ఆరో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్‌హౌస్‌లో ఇప్పటి వరకు మొత్తం నాలుగు బాహుబలి పంపులను ఎత్తిపోతలకు వినియోగించారు. ఆగస్టులో గాయత్రి పంప్‌హౌస్ నుంచి మధ్య మానేరు ప్రాజెక్టుకు సుమారు 13 టీఎంసీల నీటిని తరలించారు. తాజాగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నీటిని మళ్లించేందుకు వెట్‌రన్ నిర్వహించారు. ఎత్తిపోతల అవసరం అంతగా లేకపోవటం వల్ల కొన్ని గంటల్లోనే బాహుబలి పంపును నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్ వెట్‌రన్‌ను పర్యవేక్షించారు.
బాహుబలి ఆరో పంపు వెట్‌రన్ విజయవంతం - Bahubali Sixth Pump Vet Run Successful
కరీంనగర్ జిల్లాలోని లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్‌హౌస్‌లోని ఆరో బాహుబలి పంపు వెట్‌రన్ విజయవంతమైంది. ఇప్పటికే నాలుగు పంపుల పరీక్ష విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ పంపులతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నీళ్లు మళ్లించనున్నారు.
bahubali-sixth-pump-vet-run-successful