తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి పొదుపుపై మహిళా సంఘాలకు అవగాహన

summary స్వశక్తి సంఘ మహిళలకు జల సంరక్షణ చర్యలపై గ్రామీణాభివృద్ధి సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది.  నీటి పొదుపు చేసేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని పీడీ వెంకటేశ్వరరావు సూచించారు.

By

Published : Jul 25, 2019, 11:22 PM IST

నీటి పొదుపుపై మహిళా సంఘాలకు అవగాహన

నీటి వృథాను అరికట్టడం, వాన నీటిని సంరక్షించడంపై అవగాహన కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు శ్రీకారం చుట్టారు. కరీంనగర్​ జిల్లాలో స్వ శక్తి సంఘ మహిళలకు మూడు రోజలు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రతిరోజు ఇళ్లలో వినియోగించే నీటిని వృథాగా వదిలేయకుండా భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాన నీటిని సంరక్షించేందుకు సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మహిళా రైతులు తమ పంట పొలాల్లో కందకాలు తవ్వించాలని సూచించారు. ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడడం ద్వారా భవిష్యత్​లో నీటి కష్టాలు రాకుండా నివారించవచ్చని గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వెంకటేశ్వరరావు తెలిపారు

నీటి పొదుపుపై మహిళా సంఘాలకు అవగాహన

ABOUT THE AUTHOR

...view details