తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ఆందోళన - కలెక్టరేట్ ముందు ఆశావర్కర్ల ఆందోళన

అన్ని రకాల సేవలు చేయించుకుంటూ కనీసం జీతాలు కూడా ఇవ్వట్లేదని ఆశా కార్యకర్తలు కరీంనగర్ కలెక్టరేట్ ముందు బైఠాయించారు.

కలెక్టరేట్ ముందు ఆశావర్కర్ల ఆందోళన

By

Published : Jun 10, 2019, 5:10 PM IST

తమకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఐటీయు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనకు జిల్లాలోని ఆశా వర్కర్లంతా హాజరయ్యారు. తమతో వివిధ రకాలు సేవలు చేయించుకుంటున్నా వేతనాలు మాత్రం పెంచట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్ల ఆశా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారని సీఐటీయు నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టరేట్ ముందు ఆశావర్కర్ల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details