తెలంగాణ

telangana

ETV Bharat / state

dalithabandhu: దళిత బంధు పథకానికి మరో రూ.500 కోట్లు విడుదల - telangana varthalu

దళిత బంధు పథకానికి మరో రూ.500 కోట్లు విడుదల
దళిత బంధు పథకానికి మరో రూ.500 కోట్లు విడుదల

By

Published : Aug 26, 2021, 2:15 PM IST

Updated : Aug 26, 2021, 2:39 PM IST

14:12 August 26

దళిత బంధు పథకానికి మరో రూ.500 కోట్లు విడుదల

దళిత బంధు పథకానికి ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు అమలులో భాగంగా ఇప్పటివరకు దళితబంధుకు రూ.2 వేల  కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే 15 వందల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా 500 కోట్లు కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు నిధులు బదిలీ చేసింది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ నిధులు బదిలీ చేసింది. పైలట్ ప్రాజెక్టు అమలుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేశారు.

ప్రతిష్ఠాత్మకంగా అమలు

రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వంద చొప్పున పేద దళిత కుటుంబాలను ఎంపిక చేసి పథకం కింద ఈ ఏడాది ఆర్థికసాయం అందిస్తారు. మిగతా వారికి దశల వారీగా అమలు చేస్తారు. వచ్చే ఏడాది బడ్జెట్​లో దళితబంధు కోసం రూ.30 వేల కోట్లు వరకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అఖిలపక్షం, హుజురాబాద్ దళిత ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమై దళితబంధు పథక తీరుతెన్నులు, అమలుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో జీవనోపాధి, వ్యాపారం కోసం కొన్ని యూనిట్లను కూడా సిద్ధం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ల జాబితాను సిద్ధం చేశారు. లబ్ధిదారులు వారికి నచ్చిన ఉపాధిమార్గాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మార్గానిర్ధేశం, పర్యవేక్షణ ఉంటుంది. కొంత మంది లబ్ధిదారులు కలిసి ఎక్కువ పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అండగా దళిత రక్షణ నిధి

దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే అండగా నిలిచేందుకు వీలుగా దేశంలోనే ప్రప్రథమంగా "దళిత రక్షణ నిధి"ని ఏర్పాటు చేస్తోంది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల రూపాయల్లో రూ.10 వేలను లబ్ధిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో రూ.10 వేలు కలిపి ప్రభుత్వం దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణనిధి నిధి నుంచి వారికి ఆర్థికమద్దతు ఇచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. దళిత బంధు ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షణ కోసం ప్రత్యేక చిప్ అమర్చిన గుర్తింపు కార్డుతో ఫలితాలను పర్యవేక్షిస్తారు. తెలంగాణ దళితబంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలన్న దృఢసంకల్పంతో ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చదవండి: భవిష్యత్​లో... బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు: కేసీఆర్‌

Last Updated : Aug 26, 2021, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details