కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో భాజపా నుంచి కుందనపల్లి గీత, భాషబోయిన రమేష్ నామపత్రాలు సమర్పించారు. అధిష్ఠానం గీతను అభ్యర్థిగా ప్రకటించి బీ-ఫామ్ ఇచ్చింది.
ప్రత్యర్థి బీ ఫామ్ చింపేశాడు.. టికెట్ దక్కలేదని! - another apirent tored b form in huzurabad
ఎన్నికల్లో పోటీ చేయడం చాలా మందికి ఓ కలైతే... పార్టీ అధికారిక అభ్యర్థిగా నిలబడటం అధృష్టంగా భావిస్తారు. పోటీ ఎక్కువగా ఉంటే నానా తంటాలు పడి బీ-ఫామ్ తెచ్చుకుంటారు. చాలా మందికి అందినట్టే అంది.. చేజారిన సందర్భాలుంటాయి. కానీ ఇక్కడ కొంచెం వింత ఘటన జరిగింది.

టికెట్ దక్కలేదన్న అక్కసుతో బి-ఫామ్ చించివేత
గీత తన అనుచరులతో కలిసి బి-ఫామ్ సమర్పించేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది. అదే సమయంలో బాషబోయన రమేష్ కూడా అక్కడికి వచ్చాడు. గీత భర్త రవీందర్ రెడ్డి చేతిలో ఉన్న బీ-ఫామ్‌ని రమేష్ చింపేశాడు. కాసేపైతే అధికారులకు సమర్పించాల్సిన పత్రాలు చింపేసరికి... ఏం చేయాలో తోచలేదు. అభ్యర్థి విజ్ఞప్తి మేరకు భాజపా నాయకులు మరో బీ-ఫామ్‌ను అందించగా కథ సుఖాంతమైంది.
టికెట్ దక్కలేదన్న అక్కసుతో బి-ఫామ్ చించివేత
ఇదీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'
TAGGED:
another apirent tored b form