ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపై కరీంనగర్లో తెరాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఉద్యోగ విద్య అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం నిర్ణయించడం అభినందనీయమని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - telangana varthalu
అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ అమలుపై కరీంనగర్లో తెరాస ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అగ్రవర్ణ పేదల మద్దతు ఉంటుందని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదల పూర్తి మద్దతు ఉంటుందని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఎటూ తేల్చని కాంగ్రెస్