కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో పల్లెలు అప్రమత్తమయ్యాయి. కరోనా రాకుండా అన్ని జాగ్రత్తులు తీసుకుంటున్నారు. బయట వారిని గ్రామంలోకి రాకుండా చూసుకుంటున్నారు. రోడ్లపై ముళ్ల కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. వీటితో ఇబ్బందులు తలెత్తటమే కాకుండా సకాలంలో వైద్య సిబ్బంది గ్రామాలకు చేరుకోలేకపోతున్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం వద్ద ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. మానకొండూరు మండలం గంగిపల్లిలో ఓ గర్భిణి నొప్పులతో బాధపడుతున్నట్లు 108 సిబ్బందికి సమాచారం అందింది. వీణవంక మండలం చల్లూరులో ఉన్న ఆంబులెన్స్ గంగిపల్లికి వెళ్తుండగా... గంగారం వద్ద రోడ్డుపై ఏర్పాటు చేసిన ముళ్లకంచె అడ్డుగా వచ్చింది.