తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా ఇసుకు తరిలించే వారిపై నిఘా - karimnagar

అక్రమంగా ఇసుకను తరిలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అధికారులు నిఘా పెట్టారు. తనిఖీలు చేసి 13 ట్రాక్టర్లు, ఇసుకను సీజ్ చేశారు.

అక్రమంగా ఇసుక తరలించేందుకు యత్నం

By

Published : Apr 16, 2019, 8:47 PM IST

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో దిగువ మానేరు నదిలో అక్రమంగా ఇసుక తరలించడంపై అధికారులు స్పందించారు. గ్రామ శివారులో నిల్వచేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తహశీల్దార్ గుడ్ల ప్రభాకర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీఆర్వో రాణి, వీఆర్ఏలు బాలరాజు, భూమయ్యతో పాటు పలువురు నిఘా పెట్టి 13 ట్రాక్టర్లు, అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక నిల్వలను సీజ్ చేసి తహశీల్దార్​కు నివేదిక పంపించారు.

అక్రమంగా ఇసుక తరలించేందుకు యత్నం

ABOUT THE AUTHOR

...view details