కరీంనగర్ జిల్లాలోని లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యలపై ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సర్వే చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పున్నము రవి, కోశాధికారి పుల్లెల మల్లయ్య, లారీ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సర్వేలో వచ్చిన సమస్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగష్టు 9న పెద్ద ఎత్తున 'జైల్ భరో' కార్యక్రమం నినర్వహిస్తామని తెలిపారు. కరోనా సమయంలో లారీ యజమానులు, డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పున్నము రవి అన్నారు.
లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యలపై సర్వే - లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యలపై సర్వే
కరీంనగర్ జిల్లా కేంద్రంలో లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యల పట్ల అవగాహన కోసం ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ నాయకులు సర్వే చేపట్టారు. సర్వేలో వచ్చిన సమస్యలపై ఆగష్టు 9న పెద్ద ఎత్తున 'జైల్ భరో' కార్యక్రమం నినర్వహిస్తామని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పున్నము రవి తెలిపారు.
![లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యలపై సర్వే airtwf survey in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8156213-602-8156213-1595590435680.jpg)
ఇన్నాళ్లు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న లారీ యజమానులకు, డ్రైవర్లకు ప్రభుత్వం సాయం చేయకుండా డీజిల్ ధర పెంచి మరింత కష్టపెడుతోందని పున్నమి రవి ఆరోపించారు. అలాగే ఫిట్నెస్, ఇన్సూరెన్స్, రెన్యూవల్ ఛార్జీలను విపరీతంగా పెంచిందని తెలిపారు. లారీ యజమానుల, డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా చేసేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగష్టు 9న జరపబోయే జైల్ భరో కార్యక్రమానికి కార్మికులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
ఇవీ చూడండి:కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు