కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేటలో వ్యవసాయ అధికారులు మొక్కజొన్న పంటల్లో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. కత్తెర పురుగు తీవ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు చేశారు. మొక్కజొన్న తొలిదశలోనే పురుగు వ్యాపించిందని అన్నదాతలు పేర్కొన్నారు. వాతావరణ మార్పులతోనే కత్తెర పురుగు ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. పంట రక్షణకు లింగాకర్షక బుట్టల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. సస్యరక్షణ చర్యలతోనే పురుగు బెడదను అధిగమించవచ్చని తెలిపారు.
కత్తెర పురుగుపై రైతులకు అవగాహన - AGRICULTURE OFFICERS AWARENESS CAMP FOR FARMERS
మొక్కజొన్నను ఆకర్షిస్తున్న కత్తెర పురుగు నివారణపై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి రైతులకు అవగాహన కల్పించారు వ్యవసాయ అధికారులు.

కత్తెర పురుగుపై రైతులకు అవగాహన