కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజు పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధమైంది. ఎండవేడిమికి మంటలు క్షణాల్లో వ్యాపించటం వల్ల ఊర చెరువు పరిసర ప్రాంతాల్లో పశుగ్రాసం బుగ్గి అయింది. మంటల ధాటికి రైతుల పంపుసెట్లు విద్యుత్ మోటార్లు బావుల్లో పడ్డాయి. పొలం వద్ద బైక్ తేవడానికి వెళ్లిన యువకునికి తీవ్ర గాయాలు కావడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగ్నిమాపక వాహనం చేరుకోవడం ఆలస్యం కావడం వల్ల పశుగ్రాసం పూర్తిగా కాలిపోయిందని రైతులు ఆవేదన చెందారు.
ప్రమాదవశాత్తు 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధం - fire
ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధమైన ఘటన కరీంనగర్ జిల్లాలోని దేశరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడం వల్లే పశుగ్రాసం పూర్తిగా కాలిపోయిందని రైతులు తెలిపారు.
ప్రమాదవశాత్తు 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధం