చదువులమ్మ చెట్టు నీడలో ఎదిగిన పూర్వ విద్యార్థులు 37 ఏళ్లకు మళ్లీ కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలతో అందరూ తమ బాల్యాన్ని స్మరించుకున్నారు. తమ గురువులకు పాదాభివందనాలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఉన్నత పాఠశాల 1984 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు గెట్ టుగెదర్ కార్యక్రమంలో సందడి చేశారు.
చదువులమ్మ ఒడిలో... 37 ఏళ్ల తర్వాత..! - telangana latest news
పాఠశాల రోజులు జీవితంలో అత్యంత మధుర క్షణాలు. ఎలాంటి కల్మషం లేకుండా స్నేహితులతో సరదాగా గడిపిన రోజులు. ఆ రోజులు ఒక్కసారి మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ లోటు తీర్చుకునేందుకు కూడా ఓ మార్గం ఉంది. అదే మనం పిలుచుకునే గెట్ టుగెదర్. దాదాపు 37 ఏళ్ల తర్వాత మన బాల్య స్నేహితులను చూస్తే ఎలా ఉంటుంది. అందుకు వేదికగా నిలిచింది కరీంనగర్ జిల్లా వెదిర ఉన్నత పాఠశాల. 1984 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఒక్కసారిగా విద్యార్థులుగా మారి సందడి చేశారు.
చదువులమ్మ ఒడిలో... 37 ఏళ్ల తర్వాత..!
ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. తెలియని వయసులో అల్లరిగా తిరిగినా... తమను సన్మార్గంలో పెట్టిన గురువుల గొప్ప మనసులను కొనియాడారు. ఉపాధ్యాయులు బెత్తం పట్టిన రోజులను తీపి జ్ఞాపకాలుగా గుర్తు చేసుకున్నారు. ఒక్కసారిగా 15 ఏళ్ల పిల్లలుగా మారి వేడుకను జరుపుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నామని చాలమంది భావోద్వేగానికి గురయ్యారు.