కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావు పేట గ్రామంలో బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపట్టాల్ గ్రామంలో జరిగిన హత్యాచార నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు వచ్చి నచ్చజెప్పగా పరిస్థితి సద్దుమణిగింది.
ఎల్లపట్టాల్ హత్యాచార నిందితులను శిక్షించాలంటూ ధర్నా - adilabad rape accused to be punished
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపట్టాల్ గ్రామ మహిళ హత్యాచార నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గోపాల్రావు పేటలో నిరసన వ్యక్తం చేశారు.
ఎల్లపట్టాల్ హత్యాచార నిందితులను శిక్షించాలంటూ ధర్నా
TAGGED:
కరీంనగర్లో ధర్నా