కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కృష్ణానగర్, బొమ్మకల్ కాలనీల్లో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 200 మంది పోలీసు బలగాలు పాల్గొన్న ఈ కట్టడి ముట్టడిలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 2 వందల ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
'నిర్బంధ తనిఖీలకు ప్రజలు సహకరించాలి' - latest news on corden search in karimnagar
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కృష్ణానగర్, బొమ్మకల్ కాలనీల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

'నిర్బంధ తనిఖీలకు ప్రజలు సహకరించాలి'
కాలనీలో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ ప్రజలకు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కొరకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ప్రజలు సహకరించాలని కోరారు.
'నిర్బంధ తనిఖీలకు ప్రజలు సహకరించాలి'
ఇదీ చదవండిఃసైబర్ నేరాల కట్టడికి భాగ్యనగరంలో ఇన్నోవేషన్ సెంటర్