అధిష్ఠానం తనకు అప్పగించిన పార్టీ సభ్యుత్వ నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తానని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ వై.సునీల్ రావు అన్నారు. నగరంలోని 9వ డివిజన్లో తెరాస జెండాను ఆవిష్కరించిన ఆయన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నగరంలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం - కరీంనగర్ మేయర్ సునీల్‌రావు తాజా
కరీంనగర్లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఊపందుకుంది. ఇంకా మూడు రోజుల సమయమే మిగిలి ఉండడంతో 60 డివజన్ల పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను నగర మేయర్ సునీల్ రావు పర్యవేక్షిస్తున్నారు.
నగరంలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అమలు పరుస్తొన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని మేయర్ సునీల్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత