తెలంగాణ

telangana

ETV Bharat / state

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి - acb

చేసిన పనులకు బిల్లు కావాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్​ చేసిన నీటి పారుదల అధికారిని ఏసీబీకి పట్టించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది.  సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్​ సమీపంలో అధికారి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

నిందితుడు నరసింహారావు

By

Published : Jul 16, 2019, 7:48 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీటి పారుదల అవినీతి అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. కొండపర్తి వెంకటరామయ్య అనే గుత్తేదారు 2017లో మిషన్​ కాకతీయలో భాగంగా రెండు చెరువుల్లో పనులు చేపట్టారు. వీటికి సంబంధించి బిల్లు ఇప్పించాలని దమ్మపేటలో నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న నరసింహారావు వద్దకు వెళ్లారు. బిల్లు రావాలంటే రూ. 15 వేలు లంచం ఇవ్వాలని నరసింహారావు డిమాండ్​ చేశాడు. వెంకటరామయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సత్తుపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్​లో నరసింహారావు డబ్బు తీసుకుంటుండగా వరంగల్ ఏసీబీ పట్టుకుంది.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details