కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు నెలకొల్పిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కళాశాల పక్కనే ఎస్సీ బాలికల వసతిగృహం ఉందని.. అయినా మద్యం షాపుకు అనుమతులివ్వడం పట్ల విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలోకి వచ్చి మద్యం సేవిస్తున్నారంటూ ఆరోపించారు.
కళాశాల ముందున్న వైన్‌షాప్ తీసేయాలి.. - students protest in karimnagar
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందున్న మద్యం షాపును తొలిగించాలంటూ కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
కళాశాల ముందున్న మందుషాపు తీయాలని విద్యార్థుల ధర్నా
జగిత్యాల రహదారిపై రాస్తారోకో చేపట్టి అనంతరం మద్యం షాప్ ఫ్లెక్సీలను చింపేశారు. పోలీసులు మద్యం షాపును తీసివేస్తామని హామీ ఇవ్వగా విద్యార్థులు ఆందోళనను విరమించారు.
ఇవీచూడండి: "పూటుగా తాగాం... ఆ యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలనుకున్నాం..."