సమస్యలు పరిష్కరించాలని కళ్లకు గుడ్డలు కుట్టుకుని ధర్నా - abvp_nirasana
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ గీతాభవన్ కూడలిలో ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు.
ఏబీవీపీ ధర్నా
కరీంనగర్ గీతాభవన్ కూడలిలో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వివిధ పాఠశాలలు,కళాశాలలకు చెందిన విద్యార్థులు కళ్లకు నల్ల వస్త్రాలు కట్టుకొని నిరసన తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్రస్థాయిలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.