కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ, వయో పరిమితి పెంపును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆందోళన - mla camp office
చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో విద్యా సంస్థలు మూసివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.